Somireddy : గిరిజనుల సమస్యల కోసం పరిష్కారం వేదిక: సోమిరెడ్డి

Somireddy : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని 39 వేల మంది గిరిజనుల కోసం పరిష్కార వేదిక ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గిరిజనుల్లో చాలా మందికి ఆధార్, రేషన్ కార్డులు లేవని, సుమారు 90 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారని అన్నారు. పింఛన్ సమస్యలు కూడా ఉన్నాయని, వీటన్నింటిని పరిష్కరించేందుకే ఓ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గిరిజనుల దుర్భర జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. గత ఐదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన గిరిపుత్రులను ఆదుకుంటామని, ప్రతి అధికారి గిరిజనుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. స్థానికులకు లోన్లు మంజూరు చేస్తామని, పాఠశాలలను అభివృద్ధి చేస్తామని సోమిరెడ్డి తెలిపారు.

TAGS