JAISW News Telugu

Aditya L1:జ‌న‌వ‌రి 6న గ‌మ్య‌స్థానానికి ఆదిత్య ఎల్ 1..అక్క‌డ ఏం చేయ‌బోతోంది?

Aditya L1:చంద్ర‌యాన్ స‌క్సెస్ కావ‌డంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న‌ ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు సూర్యుడిపై ఆదిత్య ఎల్ 1 పేరుతో ప్ర‌యోగం చేసిన‌ విష‌యం తెలిసిందే. సూర్యుడిని అద్యాయ‌నం చేసేందుకు ఉద్యేశించిన ఆదిత్య ఎల్ 1 త‌న ప్ర‌యాణంలో తుది అంకానికి స‌మీపించింది. జ‌న‌వ‌రి 6న త‌న గ‌మ్య‌స్థానానికి చేరుకోనుంది. ఈ మేర‌కు భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ చైర్మ‌న్ ఎస్‌. సోమ‌నాథ్ వెల్ల‌డించారు. ఓ ఎన్జీఓ నిర్వ‌హించిన భార‌తీయ విజ్ఞాన స‌మ్మేళ‌నంలో భాగంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.

ఆదిత్య ఎల్ 1 జ‌న‌వ‌రి 6వ తేదీన ఎల్ 1 పాయింట్‌లోకి ప్ర‌వేశిస్తుంద‌ని మేం అంచ‌నా వేస్తున్నాం. దీనికి సంబంధించిన క‌చ్చిత‌మైన వివ‌రాల‌ను త‌గిన స‌మ‌యంలో వెల్ల‌డిస్తాం` అన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎల్ 1పాయింట్‌కు చేరుకున్న త‌రువాత మ‌రోసారి ఇంజిన్‌ను మండిస్తాం. త‌రువాత ఈ వ్యోమ‌నౌక ఎల్‌1 కేంద్రంలో స్థిర‌ప‌డుతుంది. అది విజ‌య‌వంతంగా ఆ పాయింట్ వ‌ద్ద‌కు చేరుకున్న త‌రువాత అక్క‌డే క‌క్ష్య‌లో తిరుగుతూ ఉంటుంది.

ఐదేళ్ల పాటు భార‌త్ స‌హా ప్ర‌పంచ దేశాల‌కు ఉప‌క‌రించే స‌మాచారాన్ని సేక‌రిస్తుంది. సూర్యుడిలో వ‌చ్చే మార్పులు, అవి మాన‌వ జీవ‌నంపై చూపే ప్ర‌భావాన్ని అర్థం చేసుకోవ‌డానికి ఆ స‌మాచారం ఉప‌యోగ‌ప‌డుతుంది` అన్నారు. అంతే కాకుండా భార‌త స్పేస్ స్టేష‌న్‌ను నిర్మించేందుకు ఇస్రో ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింద‌న్నారు. సౌర వాతావ‌ర‌ణాన్ని లోతుగా అధ్య‌య‌నం చేయ‌డం ఆదిత్య ఎల్ 1 ల‌క్ష్యం. భార‌త్ త‌రుపున సూర్యుడిని ప‌రిశోధించేందుకు ఇస్రో చేప‌ట్టిన తొలి మిష‌న్ ఇదే.

భూమి నుంచి 15 ల‌క్ష్లల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ 1కు చేరాక దాని క‌క్ష్య‌లో ప‌రిభ్ర‌మిస్తూ అధ్య‌య‌నం మొద‌లు పెడుతుంది. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్ల‌ను మోసుకెళ్లింది. సౌర వాతావ‌ర‌ణం, సౌర జ‌లాలు, క‌రోన‌ల్ మాస్ ఎజెక్ష‌న్‌, త‌దిత‌ర విష‌యాల‌ను అధ్యయ‌నం చేసేందుకు ఇవి కీల‌క‌మైన స‌మాచారాన్ని అందించ‌నున్నాయి. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 2వ తేదీన ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

Exit mobile version