Influencer died : రీల్ చేస్తూ లోయలో పడి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మృతి

Influencer died
Influencer died : ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్సర్ అన్వీ కామ్ దార్ (26) రీల్స్ చేస్తూ మృతి చెందింది. ఆమె తన స్నేహితులతో కలిసి రాయ్ గడ్ లోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ రీల్స్ చేస్తూ లోయ అంచు వరకు వెళ్లి ఆమె నిలబడగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆరు గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. అయితే, అమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే మృతి చెందింది. అన్వీ కామ్ దార్ కు సోషల్ మీడియాలో 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి విశేషాలను పంచుకుంటూ ఉండేవారు. ఆమె వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్.