Sobhita : ఫస్ట్ లవ్ స్టోరీని రివీల్ చేసిన శోభిత.. ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా?
Sobhita First Love : తెలుగమ్మాయి శోభిత ధూలిపాళ టాలీవుడ్ కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడ హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ఆగస్టులో టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో గత ఆగస్టులో ఎంగేజ్ మెంట్ చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచింది. చైతూ- శోభితల ఎంగేజ్ మెంట్ ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. ఫిలిం ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అదే సమయంలో సమంత అభిమానులు శోభితను ట్రోల్ చేశారు. సమంత కన్నా ఎక్కువగానే స్కిన్ షో చేస్తున్నదని, మరి సమంతను చైతూ ఎందుకు వదిలించుకున్నాడో చెప్పాలంటూ సామ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
ఇక ఇది అలా ఉంచితే శోభితకు సినిమాలో అంత సులువుగా అవకాశాలు రాలేదు. తన సినీ నటి కావాలనుకొని ముందుగా మోడలింగ్ వైపు వెళ్లింది. అయితే అక్కడ దారుణమైన అవమానాలకు గురైంది. నల్లగా ఉన్న నువ్వు మోరల్ అవుతావా అంటూ మొహం మీదే వెటకారంగా మాట్లాడారట. ఆ అవమనాలు తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చానని చెప్పుకొచ్చింది. అయితే కష్టం ఫలించి మోడల్ రాణించింది. అలాగే సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకున్నది. అనే సమయంలో ఓ వ్యక్తిని ఎంతగానో ప్రేమించినట్లు చెప్పుకొచ్చింది. ఎంతో ఆరాధించనట్లు బయటకు వెల్లడించింది. అయితే సదరు వ్యక్తి మాత్రం శోభితను కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదట. దీంతో శోభిత డిప్రెషనలికి వెళ్లిందట. ఆ వ్యక్తి నుంచి తాను ఊహించిన సమాధానం రాకపోవడంతో డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టిందట. ఇక తనకు తానే ధైర్యం కూడగట్టుకొని మళ్లీ సినిమాలపై దృష్టి సారించిందని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. అయితే తనను రిజెక్ట్ చేసిన వ్యక్తి ఎవరో మాత్రం చెప్పడం లేదు.
ఇక బాలీవుడ్ లో స్కిన్ షోతో హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న కోశోభిత.. హీరోయిన్ గా ఎలివేట్ అవుతున్న సమయంలోనే మరోసారి ప్రేమలో పడింది. అతడే చైతూ. కొద్ది రోజుల పాటు వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆ కథనాలను వారెప్పుడూ ఖండించలేదు. వాటినే నిబం చేశారు. శోభిత కారణంగానే నాగ చైతన్య.. సామ్ ను దూరం పెట్టి విడాకులు ఇచ్చేశారని సమంత ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.