Sobhita Dhulipala : తెలుగు, హిందీ, మలయాళంలో అద్భుతమైన ప్రాజెక్టులు చేస్తున్న నటి శోభితా ధూళిపాల. రామన్ రాఘవ్ 2.0 తో కెరీర్ ప్రారంభించిన ఆమె మేజర్, గూఢచారి, కురుప్ వంటి సినిమాల నుంచి మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ల వరకు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
ఇప్పుడు ఆమె తన హాలీవుడ్ డెబ్యూ మూవీ ‘మంకీ మ్యాన్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యూనివర్సల్ పిక్చర్స్, ఆస్కార్ అవార్డు గ్రహీత జోర్డాన్ పీలే నిర్మిస్తున్న మంకీ మ్యాన్ లో హనుమంతుడి ప్రస్తావన ఉంది. స్టైలిష్ యాక్షన్ మూవీలో దేవ్ పటేల్ హీరోగా, దర్శకుడిగా నటిస్తున్నారు.
శోభిత ధూళిపాల తన తొలి హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె చాలా అందంగా, అదే సమయంలో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో సొగసుగా కనిపిస్తుంది. సామాజికంగా చీలిపోయిన నగరంలో ధనవంతులపై ప్రతీకారం తీర్చుకుంటున్న ఓ మాజీ నేరస్తుడి కథే ‘మంకీ మ్యాన్’. అదిరిపోయే విజువల్స్, ఆకట్టుకునే బీజీఎం, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్ తో సినిమా ప్యాకేజింగ్ ట్రైలర్ అమేజింగ్ గా నిలిపింది. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఈ మూవీతో తన కెరీర్ మరో మలుపు తిరుగుతుందని ఆమె బలంగా నమ్ముతుంది. ఇక ట్రైలర్ లో శోభితను చూసిన వారు హాలీవుడ్ హీరోయిన్ అంటే అందరూ నమ్ముతారని కామెంట్లు పెడుతున్నారు. మంకీ మ్యాన్ ఆమె కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందని, విషెస్ చెప్తున్నారు.