America : అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం..చిక్కుకుపోయిన వేలాది మంది.. దారుణంగా పరిస్థితి..

Snow storm in America

winter Snow storm in America

Snow storm in America : అగ్రరాజ్యం మంచు తుఫాన్ ధాటికి వణికిపోతోంది. ఈ శీతాకాలపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా మిడ్ వెస్ట్ చుట్టుపక్కల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ తుఫాన్ వల్ల ఏకంగా 2000 విమాన సర్వీసులు క్యాన్సిల్  అయ్యాయి. మరో 2400 విమానాలు లేట్ గా నడుస్తున్నాయని అధికారులు చెప్పారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయారని వారు తెలిపారు.

కాగా, చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో 40 శాతం విమాన సర్వీస్ లను క్యాన్సిల్ చేశారు. అందులో 36 శాతం విమానాలు ఈ ఎయిర్ పోర్ట్ కు రావాల్సి ఉండగా.. ఇక చికాగో మిడ్ వేస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి రావాల్సిన 60శాతం విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులతో పాటు పలు ఎయిర్ పోర్టులు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసినట్టు పేర్కొంటున్నాయి. 737 మ్యాక్స్ 9 విమానాల ల్యాండింగ్ లో ఇబ్బంది ఉండడంతో.. పెద్ద సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ కావడానికి కారణంగా తెలుస్తోంది.

మంచు తుఫాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. తీవ్ర మైన గాలులతో గ్రేట్ లేక్స్, సౌత్ ఏరియాలో దాదాపు 2,50,000 ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇల్లినాయిస్ లో 97వేల మంది దాక చీకటిలో ఉన్నారు. చలిగాలుల తీవ్రత కారణంగా 1.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

TAGS