JAISW News Telugu

Allu Arjun : ఆ హీరోయిన్ తో నటిస్తే విడాకులు ఇచ్చేస్తా అంటూ అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చిన స్నేహ రెడ్డి!

sneha reddy warning to allu arjun

sneha reddy warning to allu arjun

Allu Arjun : నటుడు అన్న తర్వాత ప్రతీ ఒక్కటి చెయ్యాలి. రొమాంటిక్ సన్నివేశాల్లో అయినా, యాక్షన్ సన్నివేశాల్లో అయినా ఎలాంటి లిమిటేషన్స్ ని పెట్టుకోకూడదు. కానీ కొంతమంది మాత్రం ఇంట్లో వాళ్ళ కోసం కొన్ని గీతాలు గీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం ఆయన సుకుమార్ తో కలిసి పుష్ప సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్టు గతం లో ఒక అధికారిక ప్రకటన చేసాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఎనిమల్’ బ్యూటీ తృప్తి దిమిరి ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇది విన్న తర్వాత స్నేహ రెడ్డి అల్లు అర్జున్ కి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ఆ అమ్మాయితో కలిసి నటిస్తే ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతాయి జాగ్రత్త అని చెప్పిందట.

ఎందుకంటే తృప్తి దిమిరి ‘ఎనిమల్’ చిత్రం లో చాలా బోల్డ్ గా నటించింది. ఎంత బోల్డ్ అంటే కుర్రాళ్ళు సైతం కళ్ళు మూసుకునే రేంజ్ బోల్డ్ అన్నమాట. ఆ అమ్మాయిని మీ సినిమాలో తీసుకుంటే నీతో కూడా అలాంటి సన్నివేశాలే ప్లాన్ చేస్తారు, ఎందుకంటే డైరెక్టర్స్ ఎవరికైనా ఆ అమ్మాయితో అలాంటి సన్నివేశాలను రాయడానికి ఇష్టపడేలా ఉన్నారు. నువ్వు అలాంటి సన్నివేశం లో నటించడానికి నేను ఒప్పుకోను, వెంటనే ఆ అమ్మాయిని సినిమా నుండి తియ్యించు అని స్నేహా రెడ్డి చాలా బలంగా చెప్పిందట. దీనికి అల్లు అర్జున్ కూడా కాదు అనలేక స్నేహ రెడ్డి చెప్పినట్టుగానే చేసాడట. తృప్తి కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు. ఎందుకంటే ఆమెకి యూత్ లో ఆ రేంజ్ క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది.

అందుకే ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇచ్చి తీసుకోవడానికి సిద్ధం గా ఉన్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ లో శ్రీలీల మేనియా ఒక రేంజ్ లో నడుస్తుంది. ఈమె త్వరలోనే సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే ఆమెకి మెడిసిన్ పరీక్షలు ఉన్నాయట. దానికి ప్రిపేర్ అవ్వడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ గ్యాప్ ని తృప్తి సరిగ్గా ఉపయోగించుకుంటే వేరే లెవెల్ కి వెళ్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.

Exit mobile version