Sneha Reddy : శోభనం రోజు అల్లు అర్జున్ అలాంటి పని చేసాడు..ఇప్పటి షాక్ నుండి తేరుకోలేదు అంటూ స్నేహ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Sneha Reddy

Sneha Reddy

Sneha Reddy : సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి జంట ముందు వరుసలో ఉంటుంది. ఎంతో క్యూట్ గా కనిపించే ఈ ప్రేమ జంట ని చూసి ఎవరైనా కుళ్ళుకోక తప్పదు. ఈరోజు పెళ్లి చేసుకొని రెండు నెలల్లో విడిపోతున్న సెలెబ్రిటీలు ఉన్న ఈ కాలం లో, ఎన్నో ఏళ్ళ నుండి అన్యోయమైన దాంపత్య జీవితాన్ని గడుపుతూ, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి, కలిసి మెలిసి ఎంతో సంతోశావంతమైన జీవితం ని అనుభవిస్తున్నారు.

కపుల్ గోల్స్ అంటే ఇలా ఉండాలి అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తనకి సంబంధించిన ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె షేర్ చేసే అర్హ వీడియోస్ కి ఎంతో మంచి క్రేజ్ ఉంటుంది. చూసేందుకు సినిమా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందం తో మెరిసే స్నేహ రెడ్డి, రీసెంట్ గానే ఒక యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ తో మొదటి రాత్రి అనుభవం ని పంచుకొని ఇప్పటికీ ఆ సంఘటన ని మర్చిపోలేను అని చెప్పుకొచ్చింది. అంతలా అల్లు అర్జున్ ఏమి చేసాడో చూద్దాం. అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ కి మొదటి నుండి డైరీ రాసే అలవాటు ఉందట. ఎంత పనిలో ఉన్నప్పటికీ రాత్రి నిద్రపోయేటప్పుడు డైరీ రాయకుండా మాత్రం నిద్రపోడట. అలా ఆయన శోభనం రోజు కూడా డైరీ చేతిలో పట్టుకొని రావడం ని చూసి స్నేహ రెడ్డి కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యిందట. అల్లు అర్జున్ తీసుకొచ్చిన ఆ డైరీ ని చూసి ఆమెకి నవ్వాలో, ఏడవాలో లేదా తిట్టాలో అర్థం కాక, విచిత్రమైన అనుభూతిని పొందింది అట.

ఈ సంఘటనని ఇప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకుంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది దీనిపై ట్రోల్ల్స్ కూడా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టు 15 వ తారీఖున ఆ సినిమా విడుదల కాబోతుంది.

TAGS