Snake Bites : 40 రోజుల్లో ఏడుసార్లు పాముకాటు.. పాములు పగబడతాయా?
Snake bites : యూపీలోని ఫతేపూర్‌లో 24 ఏళ్ల వికాస్ పదే పదే పాము కాటుకు గురికావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎంవో నేతృత్వంలో ఇద్దరు నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి 48 గంటల్లోగా విచారణ జరిపి నివేదిక అందజేయనున్నారు. వికాస్‌ను 40 రోజుల్లో 7 సార్లు పాము కాటు వేసింది. ఈసారి అతడి పరిస్థితి విషమంగా మారింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం తాను ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఫతేపూర్ సీఎంవో డాక్టర్ రాజీవ్ నయన్ గిరి ప్రకటన వెలువడింది. ఈ విషయం నా దృష్టికి వచ్చిందని చెప్పారు. నేను నిన్న డిఎం కార్యాలయంలో కూర్చున్నాను, సమావేశం జరుగుతుండగా ఆ వ్యక్తులు (బాధితురాలు) డిఎమ్‌కి దరఖాస్తు ఇచ్చారు. యువకుడిని 5 నుంచి 6 సార్లు పాము కాటేసిందని చెప్పారు. ఇప్పుడు పాము అతన్ని ఏడోసారి కాటేసింది. ప్రతిసారీ శని-ఆదివారాల్లో కాటు వేసేది. ప్రస్తుతం బాధితుడికి చికిత్స కొనసాగుతుంది.
పాము కాటుకు గురైన ప్రతిసారీ అదే ప్రైవేట్ ఆస్పత్రికి వెళతామని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారని సీఎంఓ తెలిపారు. అదే ఆస్పత్రిలో ఎందుకు చికిత్స అందిస్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. యాంటీవీనమ్ ఔషధం పదేపదే వాడటం వలన దుష్ప్రభావాలకు కూడా కారణం కావచ్చు. ప్రస్తుతం మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో విచారణ నివేదిక రానుంది. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో యాంటీవీనమ్ ఇంజక్షన్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంది. మా బృందం ఆ ఆసుపత్రికి వెళ్లి రోగిని కలుస్తుంది. యువకుడి శరీరంపై ఎక్కడ, ఎన్ని గాట్లు ఉన్నాయో టీమ్ పరిశీలిస్తుంది. ఏడు సార్లు పాము కాటు అంటే ఏడు మచ్చలు ఉంటాయి. కాగా, ఒకే వ్యక్తి ఏడుసార్లు పాము కాటుకు గురైనట్లు సమాచారం అందిందని ఫతేపూర్ డీఎఫ్‌వో రామానుజ్ త్రిపాఠి తెలిపారు. అయితే అది ఒకే పాము కాటుకు గురైందా.. లేక వేరే పాము కాటుకు గురైందా అనేది స్పష్టంగా తెలియరాలేదు. పామును పట్టుకుని రక్షించి జూలో వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పాముకాటుతో బాధపడుతున్న 24 ఏళ్ల వికాస్ మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలో నివాసి అని, అతను 40 రోజుల్లో ఏడవసారి పాము కాటుకు గురయ్యాడు. పాము అతనిని నిత్యం వెంబడిస్తుంది. ఒకానొక సమయంలో అతను తన అత్త, మామ ఇంటికి పారిపోతే అక్కడ కూడా పాము కాటు వేసింది. చికిత్స తర్వాత ప్రతిసారీ మెరుగవుతుండటం విశేషం. కానీ ఏడవ పాము దాడి తర్వాత అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ అనూహ్య ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొదటి సారి కాటు వేసినప్పుడే పాము తన కలలోకి వచ్చి మొత్తం తొమ్మిది సార్లు కాటేసిందని చెప్పిందట. ఎనిమిది సార్లు రక్షించబడతావు కానీ తొమ్మిదో సారి నిన్ను ఎవరూ రక్షించలేరని పాము హెచ్చరించినట్లు బాధితుడు కుటుంబ సభ్యులతో చెప్పినట్లు తెలిసింది.