Shashi Tharoor PA : కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పీఏ శివకుమార్ ప్రసాద్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించడంతో కస్టమ్స్ అధిఊ13కారులు వారిని కస్టడీలోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద 500 గ్రాములకు పైగా బరువు ఉన్న బంగారం గొలుసు లభ్యమైందని, దాని విలువ రూ. 35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. గొలుసుకు సంబంధించిన పత్రాలు చూపించినందున అధికారులు వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఎంపీ శశిథరూర్ సహాయకుడు శిశకుమార్ ప్రసాద్ అని అధికారులు తెలిపారు. అతడి వద్ద ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ ఉందని చెప్పారు.
ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో దుమారం రేపింది. తాజా ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి థరూర్ పై పోటీ చేసిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీనిపై స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అంతకముందు సీఎం సెక్రటరీ బంగారం స్మగ్లింగ్ లో చిక్కారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ పఏను అరెస్టు చేశారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలైన సీపీఎం, కాంగ్రెస్ పసిడి అక్రమ రవాణాలోనూ భాగస్వాములయ్యాయి’’ అని దుయ్యబట్టారు.