Smoking Stop Benefits : ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ కొంతమంది దానిని వదులుకోలేరు. ఒక్కసారి అలవాటుగా మారితే దాని నుంచి బయటపడటం కష్టమవుతుంది. ఆపడానికి మనతో మనం యుద్ధం చేయాలి. ధూమపానం లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కానీ వాళ్లు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఒక్కసారి స్మోకింగ్ మానేస్తే కొన్ని లాభాలున్నాయి. ధూమపానం గుండె, హార్మోన్లు, జీవక్రియ మరియు మెదడుతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు, మహిళలు ధూమపానానికి అలవాటు పడ్డారు. ధూమపానం మానేయాలని భావించే వారికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కొన్నేళ్ల పాటు స్మోకింగ్ చేసి లేటు వయసులో మానేయడం వల్ల ఉపయోగం లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ ఆ వాదన తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎంత పొగతాగేవారైనా, ఏ వయసులోనైనా దాన్ని వదిలేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు. ‘1-2ఏళ్లు మానేస్తే గుండె వ్యాధులు, 5-10ఏళ్ల తర్వాత క్యాన్సర్ ముప్పు సగానికి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి’ అని నిపుణులు పేర్కొంటున్నారు.