Smita Sabharwal : స్మితా సభర్వాల్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..ఇంతకీ అందులో ఏముంది?
Smita Sabharwal : స్మితా సభర్వాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. అతి చిన్న వయస్సులోనే ఐఏఎస్ కొలువు సాధించిన ఘనత ఆమెది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది సివిల్స్ వైపు మొగ్గుచూపారు. ఐఏఎస్ కొలువుల్లో చేరే ఎంతో మందికి ఆమె రోల్ మోడల్. ఆమె కలెక్టర్ గా పనిచేసిన రోజుల్లో పేదల పక్షపాతిగా, సమర్థవంతమైన నేతగా కీర్తి సంపాదించారు. ఎక్కడా పనిచేసిన తనదైన మార్క్ తో దూసుకెళ్లడం ఆమె నైజం. సోషల్ మీడియాలో ఆమెకు యాక్టివ్ గా ఉంటారు. దేశంలోనే అతి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న అధికారిగా ఆమె పేరు సంపాదించుకున్నారు.
గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. సీఎంవో కార్యదర్శిగా, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అదే విధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు.
కాగా, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..వివిధ శాఖల్లో పాతుకుపోయిన ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు చేశారు. అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారుల శాఖలను మార్చారు. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సభర్వాల్ ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఈక్రమంలో తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ చర్చనీయాంశమవుతోంది..‘‘ మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయం చాలా ముఖ్యమైంది. తలపైకి ఎత్తి బలంగా నడువాలి’’ అంటూ ఎమోషన్ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ మేడమ్ కు ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ మీరొక సమర్థవంతమైన అధికారి, మీకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు ‘‘మీరు చెప్పింది నిజమే.. వచ్చే సవాళ్లను సానుకూలంగా, గట్టిగా ఎదుర్కొవాలి’’ అని కామెంట్ చేశారు.
What matters most is how we walk through the fire.
Chin up n walk strong🔥
#HappySunday guys! pic.twitter.com/XAUqo8N5nc— Smita Sabharwal (@SmitaSabharwal) January 21, 2024