Minister Gottipati : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి

Minister Gottipati
Minister Gottipati : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ప్రసక్తే లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ హయాంలో విద్యుత్ శాఖలో రూ.1.29 లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి విమర్శించారు. పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, దీని వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్తాయన్నా వినలేదని చెప్పారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.