OTT : చూడడానికి చిన్న సినిమాలే కానీ ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి

OTT

OTT

OTT : ప్రస్తుతం సినిమాలను ఎక్కువమంది ఓటీటీలో చూస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్లి సినిమా చూసేంత ఓపిక ఉండటం లేదు. ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్, ఆపిల్ మొబైల్ లలో అనేకమైన ఓటిటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ సినిమాలను ఓటీటీ లోనే చూస్తున్నారు.  ప్రస్తుతం తెలుగులో వచ్చిన మూడు చిన్న సినిమాలు ఓటిటి లోనే ఎక్కువ మంది చూస్తున్నారు.

 చిన్న సినిమాలు గా రిలీజ్ అయినటువంటి ఈ చిత్రాలు ఎక్కువమంది చూడడంతో ఓటీపీలో దూసుకుపోతున్నాయి. ఆయ్ చిత్రం ఆగస్టు 15 నాడు థియేటర్లలో రిలీజ్ అయింది.కాగా అక్కడ కూడా చాలా మంచి టాక్ సంపాదించుకొని పెద్ద చిత్రాలతో పోటీ పడింది. ఈ చిత్రం ద్వారా  నితిన్ అనే యువ హీరో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అదే విధంగా ఈ సినిమా కూడా చిన్న కంటెంట్ తో వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది.

దీని తర్వాత కొణిదెల నిహారిక నిర్మించినటువంటి కమిటీ కుర్రోళ్ళు చిత్రం కూడా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ తో వచ్చినటువంటి సినిమాలు ప్రస్తుతం ఎక్కువగా రన్ అవుతున్నాయి. గోదావరి జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో జరిగిన జాతరకు సంబంధించి కమిటీ కుర్రోళ్ళు సినిమాను నిర్మించారు. ఈ సినిమా 90 లో పుట్టిన వారికి చాలా నచ్చుతుంది. అప్పటి బ్యాక్ గ్రౌండ్ కథ చిత్రం కాబట్టి దీనికి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

 ఆ తర్వాత వచ్చిన చిత్రం బెంచ్ లైఫ్. ఈ మూవీలో తమిళ నటుడు వైభవ్ నటించాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీ సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కమిటీ కుర్రాళ్ళు ఈటీవీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఆయ్ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ మూడు చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం ఓటీటీ లో దుమ్ము దులుపుతున్నాయి.

TAGS