Breakfast : అల్పాహారం మానేస్తున్నారా.. అయితే డేంజరే?
ఉదయం సమయంలో ధాన్యాలతో చేసిన ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే శక్తి తీసుకురావడంలో సాయపడతాయి. రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట రాగి జావ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ఉదయం పూట మనకు అవసరమయ్యే వాటిని తీసుకుని కాపాడుకోవాలి.
ఓట్స్, పాలు, డ్రై ఫ్రూట్స్ శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉంటుంది. మెగ్నిషియం కూడా ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తిన పెసలు తింటే కూడా మనకు మంచి లాభాలు వస్తాయి. ఫ్రూట్ సలాడ్లు తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇలా మన శరీరాన్ని కాపాడుకునే క్రమంలో అల్పాహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలి.
అల్పాహారం మానేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ రోజులు బ్రేక్ ఫాస్ట్ మానేస్తే పలు రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. గ్లాసు పాలతో పాటు ఓట్స్, అటుకులు కలిపి తీసుకుంటే మేలు. ఆయిల్ తో కూడిన అల్పాహారాలు తీసుకుంటే కూడా సమస్యలు వస్తాయి. మంచి పోషకాలు నిండిన వాటిని తీసుకుంటే లాభాలు దక్కుతాయి.