JAISW News Telugu

Skanda : స్కంద చిత్రానికి కళ్ళు చెదిరే రేంజ్ టీఆర్పీ రేటింగ్స్.. హిట్ సినిమాలకు కూడా అసాధ్యం!

Skanda's eye-catching range TRP ratings..

Skanda’s eye-catching range TRP ratings..

Skanda : ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను యంగ్ హీరో రామ్ తో కలిసి ‘స్కంద’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. మితిమీరిన హింస, అవసరానికి మించి రక్తపాతం, లాజిక్స్ లేని స్క్రీన్ ప్లే, చెవులు బద్దలైపోయే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను.

అందుకే ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆ రేంజ్ లో తిరస్కరించారు. థియేటర్స్ లో ఉన్నప్పుడు మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అంతే కాకుండా రీసెంట్ గానే ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసారు. ఇలాంటి సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ ఏమి చూస్తారులే అని అనుకున్నారు ట్రేడ్ పండితులు.

కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమాకి ఏకంగా 8.5 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయట. ఇది రీసెంట్ గా విడుదలైన కొంతమంది స్టార్ హీరోల సినిమాలకంటే కూడా బెటర్ రేటింగ్స్ అని చెప్పొచ్చు. ఇదే స్టార్ మా ఛానల్ లో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’ కి 9 లోపే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అంత పెద్ద ప్రెస్టీజియస్ మూవీ కి, రామ్ లాంటి యంగ్ హీరో సినిమాకి ఒకటే రేటింగ్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ సినిమా టెలికాస్ట్ అయినా రోజే జీ తెలుగు లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ కూడా టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకి 9 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.

ఈ రెండు సినిమాలలోనూ శ్రీలీల నటించడం విశేషం. ఇది ఇలా ఉండగా స్కంద కి ఆ రేంజ్ రేటింగ్స్ రావడానికి కారణం కచ్చితంగా బోయపాటి శ్రీను అని అంటున్నారు ట్రేడ్ పండితులు. బోయపాటి శ్రీను సినిమాలకు టీవీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన తెరకెక్కించిన ఫ్లాప్ చిత్రం ‘వినయ విధేయ రామ’ కి కూడా రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుండేవి. ‘సరైనోడు’ చిత్రానికి ఇప్పటికీ కూడా 5 కి తక్కువ కాకుండా రేటింగ్స్ వస్తున్నాయి.

Exit mobile version