Deer killing case : జింకను చంపిన కేసులో ఆరుగురు అరెస్టు

deer killing case
deer killing case : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో జింకను వేటాడి చంపిన కేసులో ఆరుగురిని ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. అమ్రాబాద్ రేంజర్ గురుప్రసాద్ తెలిపిన ప్రకారం.. గత నెల 30న సార్లపల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో కొందరు సాంబార్ డీర్ ను వేటాడి చంపినట్లు సమాచారం అందడంతో ఫారెస్టు అధికారులు వెళ్లి సోదాలు చేశారు.
ఈ సందర్భంగా కుడిచింతలబయలు గ్రామానికి చెందిన మండ్లి మల్లేశ్, మండ్లి చిన్న మల్లయ్య, శీలం ఈదయ్య, గోరటి శ్రీను, సార్లపల్లికి చెందిన అర్తి కొండలు, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కు చెందిన వరికుప్పల రమేశ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1997 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.