Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆ తరువాత జరిగిన విధ్వంసం కారణంగా ప్రధాన బాధ్యుడిగా ముద్రపడి చంచల్ గూడా జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం జరిగిన విధ్వంసానికి ప్రశాంత్‌ను ఏ1గా నిర్ధారించిన జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్‌ని విధిస్తూ చంచల్‌గూడా జైలుకు తరలించారు. శుక్రవారం బెయిల్ రావడంతో శనివారం రాత్రి పల్లవి ప్రశాంత్ విడుదలయ్యాడు.
ప్రశాంత్ అరెస్ట్ అయి చంచల్ గూడ జైలుకు వెళ్లిన దగ్గరి నుంచి అతని కుటుంబానికి శివాజీ, యావర్,భోలే అన్ని విధాలుగా అండగా నిలిచారు. ప్రశాంత్‌కు బెయిల్ కోసం భోలే కూడా విశ్వప్రయత్నాలు చేశాడు. ఫైనల్‌గా ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లలో కొంత మంది గెట్ టు గెదర్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ప్రశాంత్, శివాజీ, యావర్, భోలే, నయని పావని, శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివాజీ మాట్లాడుతూ `నేను లోపల ఒకరకంగా, బయట మరోరకంగా ఉండను. ఈ ఏజ్‌లో ఏదో ఒక ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. దాంతో చిన్న చిన్న పొరపాట్లు దొర్లోచ్చు. వాటిని సరిదిద్దుకుంటాడు. మీ అందరికి తనేంటో చూపిస్తాడు. కన్నడలో లూస్ మాథ్ అనే హీరో ఉన్నాడు. ప్రశాంత్ అలా ఉంటాడు. అంతే కాకుండా ప్రశాంత్‌లో తెలియని ఓ హీరో ఉన్నాడు. అది బయటికి రావాలన్నది నా కోరిక. చిన్న చిన్న గొడవల్లో ఉంటే బయటికి తీసుకురావడానికి నేను ఎవర్ని. చట్టమే బయటికి తీసుకొస్తుంది. ప్రశాంత్ నిందితుడు కాదు బాధితుడు` అంటూ ప్రశాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.