IAS Officer : అలానే కూర్చుంటా.. సీతక్క ఇన్సిడెంట్ పై ఐఏఎస్ ఆఫీసర్ సంచలన రియాక్షన్..

IAS Officer

IAS Officer

IAS Officer : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) లో టెరిఫిక్, డైనమిక్ పర్సన్ గా గుర్తింపు దక్కించుకున్న కొద్ది మందిలో స్మితా సబర్వాల్ ఒకరు. ఆమె కలెక్టర్ గా ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి అధికారులను పరుగులు పెట్టిస్తుంది. స్మితా మేడం వచ్చిందంటే చాలు అధికారులందరూ అలర్ట్ కావాల్సిందే. పనులు, నిధులు ఖచ్చితంగా అమలు, రిలీజ్ కావాల్సిందే. లేదంటే మేడం అగ్గిమీద గుగ్గిలంగా మారుతారు.

అతి తక్కువ ఏజ్ లోనే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించిన స్మితా సబర్వాల్ విధుల్లో చేరిన ఫస్ట్ డే నుంచి స్ట్రిట్ ఆఫీసర్ అని పేరు సంపాదించుకుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చినా అన్నింటినీ తిప్పి కొట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు కీలక శాఖల్లో విధులు నిర్వహించారు స్మితా సబర్వాల్. నీటి పారుదల శాఖ కమిషనర్ గా, ఆ తర్వాత సీఎంవోగా, సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పలు పోస్టుల్లో విధులు నిర్వర్తించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలువగా.. స్మితా మేడం మాత్రం రాలేదు. దీంతో చాలా విమర్శలు వచ్చాయి. ఆమెను తొలగించారు, ఆమెను తిరిగి సెంట్రల్ విధుల్లోకి వెళ్లనుందని చాలా రూమర్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం వాటని పట్టించుకోలేదు. ఆ తర్వాత సీఎంను కలిసిన స్మితా సబర్వాల్ కామెంట్లకు చెక్ పెట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి సీతక్కతో తొలిసారి భేటీ అయిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన కొందరు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధి ముందు ఇలా చేయడం సంస్కారం కాదని కొందరు కామెంట్లు చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు.

స్మితా సబర్వాల్ అహంకారంతోనే ఇలా చేశారని తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ అంశాన్ని ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు స్మితా సబర్వాల్. తాను ఎప్పుడైనా కూడా కాలు మీద కాలేసుకొనే కూర్చుంటా అన్నారు. అది తన స్టయిల్ అన్నారు. రిటైర్ తర్వాత పాలిటిక్స్ లోకి రావడంపై ఆమె స్పందిస్తూ.. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని అన్నారు.

TAGS