Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. కానీ పండగ సెలవుల కారణంగా ఈ సినిమాకి ఆంధ్ర లో డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి. మిగిలిన అన్నీ ప్రాంతాలలో భారీ డిజాస్టర్ గా నిల్చింది.
కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాకి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని ఫేక్ పోస్టర్లు విడుదల చెయ్యగా, దాని మీడియా సోషల్ మీడియా లో పెద్ద రచ్చ జరిగింది. నిర్మాత సైతం ట్విట్టర్ వంటి మాధ్యమాలలో వెబ్ సైట్స్ తో ఫ్యాన్ వార్స్ చేసాడు. అంతే కాకుండా బుక్ మై షో యాప్ లో రేటింగ్స్ రాలేదని, కావాలని మా సినిమా మీద నెగటివ్ క్యాంపైన్ చేసారంటూ , తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ కూడా చేసాడు నిర్మాత నాగవంశీ.
ఇదంతా పక్కన పెడితే ఫ్లాప్ సినిమా అయ్యినప్పటికీ కూడా మూవీ టీం ప్రొమోషన్స్ ద్వారా సూపర్ హిట్ అని నమ్మించి జనాలను థియేటర్స్ వైపుకు పండగ సెలవుల్లో లాగడం లో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. చాలా మంది ఫ్లాప్ టాక్ రాగానే, సినిమా మీద ఆశలు వదిలేస్తుంటారు, కానీ గుంటూరు కారం మేకర్స్ మాత్రం చివరి వరకు ప్రయత్నం చేసారు. ఇంతగా చెపుతున్నారంటే సినిమాలో కచ్చితంగా ఎదో విషయం ఉండే ఉంటుంది అని అనుకోని థియేటర్స్ కి వెళ్లిన వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. నిజంగా మూవీ టీం కమిట్మెంట్ కి సెల్యూట్ చెయ్యాల్సిందే. మిగతా సినిమా మేకర్స్ కూడా వీళ్ళని చూసి ఫాలో అవ్వాలి. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు కూతురు సితార నేడు అనాధ పిల్లలకు ఉచితంగా ‘గుంటూరు కారం’ మూవీ షో కి తీసుకెళ్లింది.
‘ఏఎంబీ’ సినిమాస్ లో ఆమె అనాధ పిల్లలతో కలిసి నేడు సినిమా చూసింది. ఇంత చిన్న వయస్సులో ఇంత పెద్ద మనసుతో పిల్లల పట్ల సితార చూపించిన ఉదాశీలతని ప్రతీ ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఇది కచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. మహేష్ బాబు మరియు నమ్రత ఈ అమ్మాయికి చిన్నతనం నుండే ఇలాంటివి అలవాటు చెయ్యడం వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్తుంది.