YS Sharmila : చెల్లి మళ్లీ వచ్చింది..! ఈ సారి హుందాగా ఏమందంటే?

YS Sharmila

YS Sharmila

YS Sharmila : రావణాసురుడు లాంటి రాక్షసుడి చావుకు కారణం ఆయన చెల్లి సూర్పనఖ అని తెలిసిందే కదా? అంత కాకున్నా జగన్ ఓటమిలో ఎంతో కొంత ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం ఆయన సోదరి షర్మిల. ఆమె తన తల్లి మద్దతు కలుపుకొని జగన్ కు వ్యతిరేకంగా రాజకీయం మొదలు పెట్టారు. దీంతో ఏపీ ఓటర్లు జగన్ ను పక్కకు పెట్టారు.

2019 సమయంలో తన కోసం పాదయాత్రలు చేసిన చెల్లిని, తన గెలుపునకు సహకరించిన తల్లిని జగన్ పక్కన పెట్టడం. దీంతో పాటు తన బాబాయ్ వివేకా హత్య కేసులో సునీత చేసిన న్యాయపోరాటానికి ముళ్లకంచెలు వేయడం ఇవన్నీ జగన్ గరించి ప్రజలకు తెలియసేలా చేశాయి.

అధికారం, పదవిని అడ్డుపెట్టుకొని బాబు, పవన్, లోకేష్ తో పాటు సునీత , షర్మిలను కూడా టార్గెట్ చేశారు జగన్. చెల్లి చీర రంగు నుంచి సునీత వ్యక్త పరిచే భావం వరకు అన్నింటికీ పసుపు రంగు పులిమి ‘పచ్చకామెర్ల వాడి’కి అన్న సామెత రుజువు చేశారు. జగన్ ఎలా స్పందిస్తే అంతే స్థాయిలో సునీత, షర్మిల ప్రతి స్పందించారు. అన్నకు బాబు పిచ్చి పట్టిందంటూ మండిపడ్డారు. ఫలితాల తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చిన షర్మిల జగన్ మాదిరి కాకుండా ఓటమిపై హుందాగా ప్రవర్తించారు.

‘ఈ ఎన్నికలలో ‘ఫర్ జగన్.. .ఎగైనెస్ట్ జగన్’ అనే నినాదంతో ప్రజలు ఓట్లశారు. తాను ఓటమి పాలైనప్పటికీ వైసీపీ పోవాలని తాను చేసిన పోరాటం నెగ్గింది. వైసీపీ ఒక పిల్ల కాలువ. అది ఎప్పటికైనా కాంగ్రెస్ అనే మహా సముద్రంలో కలవాల్సిందే’ అంటూ పరోక్షంగా వైసీపీ కి కౌంటర్ ఇచ్చారు.

దీంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై పాజిటివ్ గా స్పందించారు షర్మిల. ‘గత ప్రభుత్వంలో తన బాబాయ్ వివేకా కేసులో ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా దక్కని న్యాయం ఈ ప్రభుత్వంలో దక్కుతుందని నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. షర్మిల వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా మొదలయ్యాయి. ఈ వ్యాఖ్యలతో జగన్ కు మరోసారి షర్మిల చురకలు వేసింది.

జగన్ శత్రువులను తన వైపునకు తిప్పుకోవడంలో షర్మిల ఆచితూచి అడుగు ముందుకేస్తున్నారనే చెప్పాలి. ఇందులో భాగంగానే జగన్ శత్రువులలో మొదటి వరుసలో ఉండే ఈనాడు అధినేత రామోజీ రావు కుటుంబ సభ్యులను కలిసి ఆయన చిత్ర పటానికి నివాళ్లర్పించారు. జగన్ ఓటమితో రానున్న రోజుల్లో వైసీపీ కాళీ చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీని ఉంచాలని షర్మిల భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ముందూ వెనకా చూడకుండా జగన్ ను బండకేసి బాదినట్టు షర్మిల ఇప్పుడు సహనంగా ఉంటారా..? మౌనం వహిస్తారా..? అంటే అనుమానమే కలుగుతుంది. తను గెలవకపోయినా.. ప్రత్యర్థి ఓడారు అన్న ఆనందం షర్మిల ముఖంలో కనిపిస్తోంది. దీంతో చెల్లి మళ్లొచ్చిందిరో..! జాగ్రత్త జగనన్నా అంటూ కౌంటర్లు పేలుతున్నాయి.

తన ఓటమిని హుందాగా ఒప్పుకుంటూ రాజకీయాల్లో ఇవన్నీ సహజం అనేలా షర్మిల వ్యాఖ్యలు కనిపిస్తే జగన్ మాత్రం వై నాట్ 175 నినాదం ఇచ్చి కూటమికి 164 వస్తే ఈవీఎంల తప్పు, ప్రజల మోసం అంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తన పరువు తానే తీసుకున్నారు జగన్.

TAGS