Siri Proposed Jabardast Comedian : జబర్దస్త్ కమెడియన్ కు లవ్ ప్రపోజ్ చేసిన సిరి.. అంతా షాక్.. ప్రోమో అదుర్స్!

Siri Proposed Jabardast Comedian
Siri Proposed Jabardast Comedian : బుల్లితెర గ్లామరస్ బ్యూటీలలో సిరి హనుమంతు ఒకరు.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. యూట్యూబర్ గా తన జర్నీ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆడియెన్స్ కు దగ్గర అయ్యింది.. తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ అమ్మడు చాలానే కష్టపడింది.
అయితే ఒకే ఒక్క షో తో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, స్పెషల్ సాంగ్స్, ఎన్నో వీడియోలతో తెచ్చుకున్న గుర్తింపుకు డబల్ గుర్తింపు తెచ్చుకుంది.. ఆ షో ఏంటో అందరికి తెలుసు.. బిగ్ బాస్ లో ఈమెకు అవకాశం రావడంతో అమ్మడి లైఫ్ కు ఇది టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
ఈమె బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొంది.. ఈ షోలో అమ్మడి అందాల విందు, షణ్ముఖ్ తో ఈమె నడిపిన లవ్ ట్రాక్ అన్ని కలిసి భారీ ఫాలోయింగ్ తెచ్చుకునేలా చేసింది.. ఈ సీజన్ లో ఈమె ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. ఇక ఈ సీజన్ లో సన్నీ విజేతగా నిలవగా ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు..
బిగ్ బాస్ లో ఈ అమ్మడు టాప్ 5 లోకి నిలిచి భారీ క్రేజ్ దక్కించుకుంది.. ఈ క్రేజ్ ను బయటకు వచ్చాక ఉపయోగించుకుని సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. ఇదిలా ఉండగా సిరి అద్భుతమైన అవకాశం అందుకున్న విషయం విదితమే.. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తున్న ఈ భామ ఈ మధ్యనే జబర్దస్త్ షోలో అవకాశం అందుకుంది.
ఈ షోలో ఈమె కూడా మిగిలిన యాంకర్స్ లా కామెడీ, రొమాన్స్ పండించడానికి ట్రై చేస్తుంది.. సుధీర్, రష్మీ జోడీ లానే ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ పండించే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ప్రోమో చుస్తే ఇది నిజం అనేలా ఉంది.. ఈ భామ తాజా ప్రోమోలో నూకరాజుకు లవ్ ప్రొపోజ్ చేసింది.. సుధీర్ ఎప్పుడు రష్మీకి చెప్పే డైలాగ్ చెప్పింది.. ”నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను.. ఐయామ్ లవ్ విత్ యు”.. అంటూ చెప్పి షాక్ ఇచ్చింది.