Siraj : టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్ మహ్మద్ సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచకప్ విజయానంతరం హైదరాబాద్ చేరుకున్న సిరాజ్, మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సిరాజ్ ను సీఎం అభినందించి సన్మానించారు. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ.. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నడంటూ సిరాజ్ కు కితాబిచ్చారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తక్షణం చర్చలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.