JAISW News Telugu

CM Revanth : ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ : సీఎం రేవంత్

CM Revanth

CM Revanth

CM Revanth : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోకా ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించాలని సూచించారు.

సుప్రీంకోర్టు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ అంశాలపై చర్చించిన క్యాబినెట్ సబ్ కమిటీ నిన్న నాలుగో సారి సమావేశమై ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Exit mobile version