Singer Sunita : కొడుకు సినిమా ఫలితం ని చూసి వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన సింగర్ సునీత!
Singer Sunita : సింగర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సునీత గారికి ఉన్న ప్రత్యేకమైన స్థానం గురించి మన అందరికీ తెలిసిందే. కోయల లాంటి స్వరం తో ఎన్నో వందల పాటలను పాడిన ఆమె, ఇప్పటికీ టాప్ మోస్ట్ సింగర్స్ లో ఒకరిగా కొనసాగుతూనే ఉన్నారు. రామ్ గోపాల వర్మ నిర్మాణం లో కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ‘గులాబీ’ అనే చిత్రం లో ‘ఈ వేళలో నీవు ఏమి చేస్తూ ఉంటావో’ అనే పాట ద్వారా ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిన సునీత సుమారుగా పది వేలకు పైగా పాటలను పట్టినట్టు తెలుస్తుంది.
ఇప్పటికీ ఆమె ఒక పక్క సినిమాల్లో పాటలు పాడుతూనే, మరోపక్క ‘పాడుతా తియ్యగా’ వంటి షోస్ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈమె కుమారుడు ఆకాష్ టాలీవుడ్ కి హీరో గా పరిచయం అవుతూ ‘సర్కారు నౌకరి’ అనే చిత్రం చేసాడు.
ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 వ తేదీన గ్రాండ్ గా విడుదలైంది. క్రిటిక్స్ నుండి ప్రశంసలు అయితే దక్కాయి కానీ, కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఆకాష్ కి మంచి నటుడిగా పేరు వచ్చింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఇతనికి కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాని ఆకాష్ తల్లి సునీత స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూసింది.
ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమా ఎడిటింగ్ టైం లో నేను చూసాను, అప్పుడే నాకు అద్భుతంగా అనిపించింది. ఇక ఈరోజు నేను థియేటర్ లో సినిమా చూసినప్పుడు నా ఎమోషన్ ని ఆపుకోలేకపోయాను. ఈ కన్నీళ్లు సినిమాని చూస్తే వచ్చినవి కాదు, నా బిడ్డ కలలు నిజం అవుతున్నందుకు వచ్చిన ఆనంద బాష్పాలు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఆకాష్ కనిపించలేదు, కేవలం గోపాల్ అనే పాత్ర మాత్రమే నాకు కనిపించింది. కళ్ళతో నా బిడ్డ హావభావాలు పండించడం చూసి ఆశ్చర్యపోయాను. కేవలం ఆకాష్ మాత్రమే కాదు, ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరు ఎంతో సహజంగా నటించారు. హృదయాలను హత్తుకునే ఇలాంటి సినిమాలను థియేటర్ లో చూస్తేనే అద్భుతమైన అనుభూతిని కలుగుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ చిత్రాన్ని థియేటర్ లో మిస్ కాకండి ‘ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.