JAISW News Telugu

Singareni Elections:సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Singareni Elections:సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పించింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దాంతో.. యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 27న సింగరేని ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని డిసెంబర్ 27కి బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఎన్నికల విషయంలో నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒక్కసారి గుర్తింపు సంఘం, తర్వాత యాజమాన్యం, మోసారి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి.

Exit mobile version