JAISW News Telugu

Singapore : సింగపూర్ లో మళ్లీ కొవిడ్ అలజడి

Corona

Singapore-Corona

Singapore : కొవిడ్ మహమ్మారి సింగపూర్ లో మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య 25,900కు పైగా కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని కోరారు. కొత్తగా కొవిడ్ ఉధృతి మొదలవుతోందని, అది క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాల్లో అది గరిష్ఠ స్థాయికి చేరవచ్చని హెచ్చరించారు. నిత్యవ దాదాపు 250 మంది కొవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని, పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలి ఆదేశాలు జారీ చేశారు. రోగులకు పడకలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను వాయిదా వేయాలని సూచించారు.

నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎతలా కుదిపేసిందో తెలిసిందే. అక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది రోడ్డునపడ్డారు. రెండేళ్ల తర్వాత నెమ్మదిగా కరోనా ప్రభావం తగ్గిపోయింది. అయినా ఇప్పటికీ కరోనా దెబ్బకు మనుషులే కాదు చాలా దేశాలు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాయి. ఇప్పుడు మరోసారి ఈ మహమ్మారి మళ్లీ అలజడి సృష్టిస్తోంది.

Exit mobile version