Rainy season : అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే భారీ వర్షాల సమయంలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలు, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యుత్ తీగలను అసలే తాకవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో జరిగిన ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే వర్షం పడుతుండగా చినుకులు పడ్డప్పుడల్లా రెండు వైర్లు టచ్ అయి మంటలు రావడం చూడవచ్చు. దగ్గరల్లో ఉంటే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.
విద్యుత్ అత్యవసర పరిస్థితి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయండి. అంతే కాకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ స్తంబాలను ముట్టుకోరాదు. కరెంటు వైర్ లైన్ క్రింద నిల్చోవడం, నడవటం, సెల్ ఫోన్ మాట్లాడటం చేయకూడదు. విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను సైతం మీరు ముట్టుకోకూడదు. విషయం సంబంధిత అధికారులకు తెలపాలి. అలాగే తడి చేతులతో ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను, ఎఫ్ఎం రేడియోను, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను తాకరాదు. ఇంటి పైకెక్కి కరెంటు తీగల సమీపానికి వెళ్లవద్దు. దుస్తువులను తీగలపై ఆర వేయవద్దు.