Silver Medal : మన దేశంలో జూదం (పేకాట) ఆడటం తప్పు. దీనిపై నిషేధం కూడా ఉంది. మరి పేకాటలో దేశానికి పతకం రావడమేంటని అనుకుంటున్నారా..! అది నిజమేనండి.. మనవాళ్లు జూదంలో మెడల్ సాధించారు.
బ్యూనస్ ఎయిర్స్ వేదికగా జరిగిన వరల్డ్ బ్రిడ్జ్ ఒలింపియాడ్ లో ఇండియా సీనియర్స్ బ్రిడ్జ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అమెరికన్లతో జరిగిన ఫైనల్ లో మనోళ్లు కాసింతలో పసిడి పతకం చేజార్చుకున్నారు. ఫూనల్లో భారత జట్టు 258-165 తేడాతో అమెరికా చేతిలో ఓటమి పాలైంది. రెండు రోజుల పాట జరిగిన ఈ క్రీడ హోరాహోరీగా సాగింది. మొదటి రెండు రౌండ్ల తర్వాత ఇరు జట్ల స్కోర్లు దాదాపు టై అయ్యాయి. మూడో రౌండ్ లో అమెరికన్లు పైచేయి సాధించి పసిడిన వశం చేసుకున్నారు. భారత జట్టులో కమల్ ముఖర్జీ, విభాస్ తోడి, బాదల్ దాస్, ప్రణబ్ బర్ధన్, అరుణ్ బాపట్, రవి గోయెంకా, నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అయిన గిరీష్ బిజూర్ ఉన్నారు.