Snow disappear : యుగాంతం సంకేతాలు.. ఆ పవిత్ర పర్వతంపై మంచు మాయం.. భక్తుల్లో ఆందోళన

Snow disappear

Snow disappear

Snow disappear : ఓం పర్వతం నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ ఇటీవల పర్వతంపై ఒక్క ముక్క కూడా మంచు లేకపోవడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  కోట్లాది మంది భక్తుల్లో భక్తిభావం పెంపొందించే ‘ఓం’ అనే అక్షరం కూడా కనిపించకుండా పోయింది. ఇప్పుడు నల్లని ఎత్తయిన బండరాళ్లు ఉన్న కొండ మాత్రమే ఉంది. పర్వతం పరిస్థితి చూసి పర్యాటకులతో పాటు స్థానికులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాఖండ్‌ లోని మంచుకొండలు ఆ పరమశివుడి నిలయాలుగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా ఓం పర్వతం భోలేనాథ్ నివాసమని స్థానికులు ప్రతీ రోజు ఉదయం వాటి వైపు చూసి ప్రణామాలు చేస్తుంటారు. అలాంటి పర్వతంపై మంచు లేకపోవడం అవాంఛనీయ ఘటనలను సూచిస్తోంది. ఓం ఆకారంలో భక్తులకు కనువిందు చేసే పర్వతం ఎలా మాయమైందో తెలిసి షాక్‌ అవుతున్నారు.

ఉత్తరాఖండ్ లోని వ్యాస్‌ లోయలో 14 వేల అడుగుల ఎత్తున ఉండే ఓం పర్వతంపై హిందీ పదం ‘ఓం’ ఆకారంలో మంచు కనిపిస్తుంది. అందుకే ఆ పర్వతానికి ‘ఓం పర్వతం’ అని పేరు వచ్చింది. ప్రకృతిలోని ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ ఏడాది ప్రజలు ఇక్కడి ఓం పర్వతం చూసేందుకు వచ్చినప్పుడు వారికి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడ పర్వతం కనిపిస్తుంది కానీ అందులో హీందీ అక్షరం ‘ఓం’ ఆకారం లేదు. పర్వతం నుంచి ఆ ఆకారాన్ని ఎవరు తొలగిస్తారనే సందేహం కలుగుతుంది.

గత వారం సందర్శన కోసం వచ్చిన వారు ఈ వింతను చూసి భగవానుడి అనుగ్రహం ఆ పర్వతం నుంచి తొలగిపోయిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని దీనికి గ్లోబల్ వార్మింగే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓం పర్వతం నుంచి మంచు కరిగేందుకు కారణం హిమాలయాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత అంటున్నారు పరిశోధకులు. ఐదేళ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో వర్షాలు, మంచు కురవడం, వాహనాలు పెరగడంతో  కాలుష్యం కూడా పెరుగుతుంది. భూతాపం వల్లే ఈ మంచు నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, హిమాలయాల్లోని జోలింగ్‌కాంగ్‌ను ప్రధాని గత సంవత్సరం అక్టోబర్‌లో సందర్శించిన తర్వాత పర్యాటకుల తాకిడి 10 రెట్లు పెరగింది. ఇది కూడా తాజా పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

TAGS