Chandrakant Shah as Approver : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. చంద్రబాబును బయటకు వదిలితే సాక్షులను మానిప్లేట్ చేస్తాడని సీఐడీ కోర్టుకు చెప్తూనే ఉంది. కానీ బాబు ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్ దృష్ట్యా మూడు వారాల బెయిల్ పై బటయకు పంపంది హై కోర్టు. ఆయన వచ్చిన తర్వత నుంచి పరిణామాలు వేగంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
స్కిల్ కేసుకు సంబంధించి మొత్తం 37 మంది నిందితులు ఉండగా అందులో ఏ13వ నిందితుడిగా ఉన్న సీమెన్స్ కంపెనీ ప్రతినిధి సుధీష్ షా చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారుతానని చెప్పాడు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో సంచలనం రేకెత్తించింది. అయితే చంద్రకాంత్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు తీసుకుంది. స్కిల్ కేసులో డిసెంబర్ 5వ తేదీన నేరుగా హాజరవ్వాలని కోర్టు చంద్రకాంత్ షాను ఆదేశించింది.
అయితే స్కిల్ కేసుకు సంబందించి పూర్తి వివరాలు కోర్టు వారికి ఇస్తానని చంద్రకాంత్ షా కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. స్కిల్ కేసులో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు, స్కాం లాంటివి జరగలేదని ఆయన చెబుతున్నారు. విచారణ పూర్తయితే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని ఏపీతో పాటు దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అయితే, పూర్తి చట్టబద్ధంగా, న్యాయ బద్ధంగా కేబినెట్ ఆమోదంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసిందని ఆయన తరుఫు న్యాయవాదులు చెప్తున్నారు. ఇందులో బాబుకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయని సీఐడీ తరుఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇరువురి వాదనల్లో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.