JAISW News Telugu

Siege the Ship : సీజ్ ద షిప్.. పవన్ పౌరుషమే ఇప్పుడు ట్రెండింగ్

Siege the Ship : కాకినాడ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వడానికే తనకు రెండు నెలలు పట్టిందని.. ఇక్కడ అధికార వ్యవస్థ ఇంతలా అవినీతిమయమైందని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. వాటన్నింటిని ఛేదించుకొని వెళ్లి ఏకంగా సముద్రంలో అక్రమ బియ్యంతో ఉన్న షిప్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘కేంద్రంతో ఏమైనా సమస్యలు వస్తే నేను హ్యాండిల్ చేస్తాను.. ముందు ‘సీజ్ ద షిప్’ అంటూ’ పవన్ అధికారులను తనదైన స్టైల్ లో ఆదేశించిన వీడియో వైరల్ అవుతోంది.

10వేల మంది జీవితాలు అంటూ తనను ఆపేశారని.. కానీ షిప్ ఉన్నది ఎందుకు మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికా అంటూ పవన్ ఆవేశంతో చెప్పిన డైలగులు ఇప్పుడు ఊపేస్తున్నాయి. పవన్ మేనిరిజానికి పాలనకు ప్రశంసలు కురుస్తున్నాయి.

Exit mobile version