Corona Vaccine : మా కరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే.. అంగీకరించిన ప్రముఖ కంపెనీ

Corona Vaccine

Corona Vaccine

Corona Vaccine : కొవిడ్ -19 ఎంత ఉత్పాతం కలిగించిందో తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. లక్షలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. దీంతో చాలా సంసారాలు చెల్లాచెదురయ్యాయి. చేయని తప్పుకు ప్రాణాలు బలిపెట్టుకున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎలా వ్యాపించిందో తెలియదు కానీ ప్రపంచాన్నే గడగడలాడించింది. కరోనా మహమ్మారి దాడికి కకావికలం అయింది.

కొవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు టీకాలు వేసుకున్నారు. కొవిషీల్డ్ టీకాలు చాలా మంది వేసుకున్నారు. దీంతో వైరస్ కాస్త నెమ్మదించింది. ఈ మేరకు అందరు టీకాలు వేసుకోవాలని ప్రచారం చేశారు. కానీ కొందరు వేసుకోలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కొన్ని ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వేసుకునే వారు వేసుకున్నా కొందరు మాత్రం వేసుకోలేదు.

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండెజబ్బులు వచ్చాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కానీ అందులో నిజం లేదని వైద్యులు కొట్టిపారేశారు. కానీ కరోనా వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడంతో పాటు ప్లేట్ లెట్ల సంఖ్య కూడా తగ్గిందనే వార్తలు వచ్చాయి. అరుదైన సందర్భాల్లో ఇలాంటి కేసులు కూడా కనిపించినట్లు కొన్ని నివేదికలు బహిర్గతం చేశాయి.

కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమైనట్లు అస్ట్రాజెనెకా కంపెనీ మొదటిసారి అంగీకరించింది. వ్యాక్సిన్ వల్ల దుష్ర్పభావాలు తలెత్తిన మాట వాస్తవమే అని ఒప్పుకుంది. దీంతో యూకేలో పలువురు కోర్టుకెక్కారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మా ఆరోగ్యాలు పాడయ్యాయని వాపోయారు. మాకు దిక్కెవరని నినదించారు.

కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలాంటి కేసులు వస్తాయని అస్ట్రాజెనెకా పేర్కొంది. వ్యాక్సిన్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలున్నా ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. కానీ అరుదైన సమయాల్లో ఇలాంటి తీవ్ర పరిణామాలు చూపితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని సూచించింది. ఈ కంపెనీ కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లు విక్రయించింది.

TAGS