Siddhu Craze : విజయ్ కంటే సిద్ధూకే క్రేజ్ ఎక్కువ.. ప్రీమియర్స్ ఏం చెప్తుందంటే?
Siddhu Craze : ‘డీజే టిల్లు’తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. డీజే టిల్లు బాక్సాఫీస్ రికార్డులను ఒక్క ఊపు ఊపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో మేకర్స్ సీక్వెల్ ఉంటుందని ఆ సమయంలోనే అనౌన్స్ చేశారు. అనుకున్నట్లుగానే సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వచ్చింది.
టిల్లుగా సిద్ధూ యూత్ ను టార్గెట్ చేశారు. కానీ రాను రాను ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా లేడీస్ లో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది. డీజే టిల్లు సాంగ్ ప్లే కాకుండా ఒక్క పార్టీ కూడా లేదంటే సందేహం లేదు. టిల్లు పాత్ర పరిధి అలాంటిది మరి.
టిల్లు స్క్వేర్ ప్రస్తుతం టైర్ 1 స్టార్ హీరోలతో సమానంగా (ప్రీమియర్లకు 18 డాలర్లు, శుక్రవారాలకు 15 డాలర్లు) టికెట్ల ధరలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. టిల్లును వెండితెరపై చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. అన్ని అంచనాలను మించి కేవలం రెండు రోజుల్లో (ప్రీమియర్లు, శుక్రవారంతో కలిపి) టిల్లు స్క్వేర్ 1 మిలియన్ డాలర్లను చేరుకోనుంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వచ్చే వారం విడుదల కానున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీమియర్ టికెట్ ధర టిల్లు స్క్వేర్ (18 డాలర్లు)తో పోలిస్తే తక్కువ ప్రీమియర్ టికెట్ ధర (15 డాలర్లు) ఉంటుంది.
నిజానికి సిద్ధు జొన్నలగడ్డతో పోల్చుకుంటే విజయ్ దేవరకొండ చాలా పెద్ద స్టార్, కానీ సీక్వెల్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్, టిల్లు పాత్ర యూత్ కు అంతగా కనెక్ట్ కావడం, దీంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరవడంతో ఇది సక్సెస్ అయ్యింది.