Siddharth-Aditi Rao Hydari : ఒక్కటైన సిద్ధార్థ్.. అదితి రావు హైదరీ.. సీక్రెట్ గా మ్యారేజ్!
Siddharth-Aditi Rao Hydari : సిద్ధార్థ్ – అదితి రావు హైదరీ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరు కొన్ని సందర్భాల్లో కలిసి మీడియా కంటికి చిక్కారు. ఆ సమయంలో మీడియా ప్రశ్నించగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చాలా కాలంగా వీరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా వారు ఎప్పుడూ బయటపెట్టలేదు. తాజా నివేదిక ప్రకారం, సిద్ధార్థ్ ఈ రోజు (మార్చి 27) అదితి రావు హైదరిని తెలంగాణలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.
అయితే, ఈ మ్యారేజ్ కి సంబంధించి ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరీ తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇరు వైపులా కుటుంబ సభ్యులు, కొద్ది మంది దగ్గరి బంధు మిత్రుల ఆధ్వర్యంలో వివాహం జరిగిపోయిందని తెలుస్తోంది. అయితే, ఈ కొత్త జంట సాయంత్రం తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ జంటకు కలిసి రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎటువంటి ప్రకటన వెలువడకముందే సిద్ధార్థ్, అతిధికి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా హీటెక్కుతుంది.
సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరీ 2021 తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘మహా సముద్రం’లో కలిసి పనిచేశారు. వీరు కలిసి అనేక సినిమా కార్యక్రమాలకు హాజరయ్యారు. పలు చోట్లకు టూర్లు కూడా చేశారు. సిద్ధార్థ్ మరియు అదితి కలిసి కొన్ని సోషల్ మీడియా రీల్స్ కూడా చేశారు. టాలీవుడ్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న సిద్ధార్థ్‌లానే, అదితి రావు కూడా తెలుగు అభిమానులకు సుపరిచితమైన ముఖం.