Telugu Actress : తెలుగు నటితో ఎస్సై ప్రేమాయణం..క్లైమాక్స్ లో సినిమాటిక్ ట్విస్ట్..

Telugu Actress

Telugu Actress

Telugu Actress : ప్రపంచంలో సినిమా రంగానికి ఉన్న క్రేజ్ మరే రంగానికి ఉండదు. ఇక మన భారత్ లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలన్నా, సినిమా నటులన్నా ఫ్యాన్స్ ప్రాణాలు ఇచ్చేస్తారు. ఇక హీరోయిన్లనైతే తమ కలల రాణులుగా భావిస్తుంటారు. నటులకు క్రేజ్ తో సంపాదన, విలాసవంత మైన జీవితం ఉండడంతో యువత ఫిల్మ్ నగర్ వైపు అడుగులు వేస్తుంటారు. ఆ రంగుల ప్రపంచంలో తమ సత్తా ఏంటో చూపించుకోవాలని వస్తుంటారు. అయితే అక్కడ వారు అనుకున్నంత ఈజీగా అవకాశాలు వచ్చేయవు.

మగాళ్ల పరిస్థితి పక్కన పెడితే..సినిమా మోజులో పడి ఇండస్ట్రీకి వచ్చే యువతులు ‘ఒక్క చాన్స్’ దక్కించుకోవడం కోసం ఎన్నో కమిట్ మెంట్లను దాటుకుని రావాలి. అందుకు ఒప్పుకుంటేనే చాన్స్ లు దక్కించుకోగలుగుతారు. అయితే అందరి పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పలేం. ఏదో రకంగా ఇక్కడ జాగ్రత్తగా ఉండకపోతే యువతులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సినిమా తారలకు సినిమా వాళ్లతోనే కాదు..ఇతరులతోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. దానికి నిదర్శనం ఈ జూనియర్ ఆర్టిస్టు స్టోరీ..

నిజామాబాద్ కు చెందిన పబ్బా అరుణ్ (29) ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ లో ఎస్సై గా పనిచేస్తున్నాడు. అతడు 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్సై గా పనిచేశాడు. అప్పుడే అతడికి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువతి(23)తో పరిచయం ఏర్పడింది.

ఆ యువతి సైదాబాద్ సరస్వతీ నగర్ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తుండేది. అయితే 2022 జనవరిలో ఆ యువతి తమ బంధువుల కుటుంబ సమస్యల విషయంపై సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఈక్రమంలోనే ట్రైనీ ఎస్సై అరుణ్ పరిచయమ్యాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ తరుచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. అలా అరుణ్.. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత..అరుణ్ ట్రైనింగ్ పూర్తై అతడు సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్ లలో పనిచేస్తుండేవాడు. కానీ అప్పుడు కూడా ఆ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు. అయితే ఇటీవలే అరుణ్ కు వేరే యువతితో నిశ్చితార్థమైన ఫొటోలను ఫోన్ లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో కంగుతిన్న అరుణ్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటానని, తననే పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించాడు.

కాగా, ఆ తర్వాత కొన్ని రోజులకు నిశ్చితార్థమైన యువతి సోదరుడు.. బాధిత యువతికి ఫోన్ చేసి అరుణ్ తమ సోదరినే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె వెంటనే అరుణ్ కు ఫోన్ చేసి ఈ విషయంపై నిలదీసింది. దీంతో అతడు..‘‘అవును నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని.. తనను మరిచిపో’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో తాను మోసపోయాయని గ్రహించిన బాధితురాలు శనివారం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అరుణ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

TAGS