Prabhas marriage : ఆ శుభ ఘడియలు వచ్చాయి.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలా దేవి కామెంట్స్ వైరల్

Prabhas marriage

Prabhas marriage

Prabhas marriage : ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లంటూ ఊరిస్తూ వస్తున్న ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఇలాంటి న్యూస్ చాలాసార్లు విన్నా.. ఈసారి మాత్రం పెళ్లి పక్కా ఫిక్స్ అంటున్నారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.

భారతీయ సినీ పరిశ్రమలో సల్మాన్ ఖాన్ తర్వాత ఎవరి పెళ్లి గురించైనా చర్చ వచ్చిందంటే అది కేవలం ప్రభాస్ గురించి మాత్రమే. 45 ఏళ్లు దాటినా ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లికి మాత్రం కాస్త దూరంగా ఉంటున్నారు. అలాగని  డార్లింగ్ పై పలువురు హీరోయిన్లతో రిలేషన్ షిప్, రేపోమాపో పెళ్లి అంటూ ఇప్పటికీ రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాటిని ప్రభాస్ లైట్ గా తీసుకుంటూ ఉంటాడు.

బిల్లా సినిమా నుంచి ప్రభాస్, అనుష్కల జోడి బాగుందంటూ కాంప్లిమెంట్లు వచ్చాయి. అదే సమయంలో మిర్చి, బాహుబలి సినిమాల్లో కంటిన్యూగా అనుష్కనే హీరోయిన్ కావడంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు వచ్చాయి. ఈ రూమర్లను అటు ప్రభాస్, ఇటు అనుష్క పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఆదిపురుష్ లో ప్రభాస్ తో జత కట్టిన కృతిసనన్ తో ప్రభాస్ రిలేషన్ లో ఉన్నాడంటూ వచ్చిన న్యూస్ వచ్చినా అవి రూమర్లే అని తేలిపోయాయి.

అప్పట్లో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారీ పెళ్లి గురించే అడిగేవారు. చేయాలని మాకూ ఉందని, కానీ ప్రభాస్ టైమ్ ఇవ్వడం లేదంటూ చమత్కరించేవాడు. కొన్ని సందర్భాల్లో మీరే అడగండంటూ సెటైర్లు వేసేవాడు.  ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ విజయవాడలో ఇంద్ర కీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లగా ఆమె మీడియా మాట్లాడారు. ప్రభాస్ పెళ్లెప్పుడు  అని ఒక విలేఖరి ప్రశ్నించగా, ఆ శుభ ఘడియలు వచ్చాయని, అతి త్వరలోనే మీ  అందరి సమక్షంలో ఈ శుభవార్త చెబుతామని సమాధానమిచ్చింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ దసరాకు ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన శుభవార్త చెప్పబోతున్నారా?, పెళ్లి కూతురు ఎవరై ఉంటారో అని ఇప్పటి నుంచే సోషల్ మీడియా జోరుగా  చర్చలు నడుస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ తమ దగ్గరి బంధువుల అమ్మాయితో వివాహం జరగబోతున్నదని తెలుస్తున్నది. ఈ సంబంధం ఇది వరకే ఖాయమైనా, ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు సమాచారం.

TAGS