Shruti Haasan : ప్రభాస్ ఆ టైటిల్ కి అర్హుడు కాదు అంటూ శృతిహాసన్ సంచలన కామెంట్స్!
Shruti Haasan : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సలార్ చిత్రం గత ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఈ సినిమా పలు థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతుంది. కొన్ని సెంటర్స్ లో సంక్రాంతి పండుగ రోజు హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి.
అయితే సినిమా పీక్ రేంజ్ లో రన్ అవుతున్న సమయం లో విడుదల చెయ్యని కొన్ని ఇంటర్వ్యూస్ ని థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్ లో ఒక ఇంటర్వ్యూ ని విడుదల చేసింది హోమబుల్ సంస్థ. ఈ ఇంటర్వ్యూ కి యాంకర్ శృతి హాసన్ ఉండగా, ప్రభాస్ మరియు పృథ్వీ రాజ్ లు విచ్చేసారు. కాసేపు ఫన్ తో కూడిన ప్రశ్నలు అడుగుతూ సరదాసరదాగా సాగిపోయింది ఈ ఇంటర్వ్యూ మొత్తం.
అయితే ఈ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ ‘సలార్’ సినిమాలో తనకి అవకాశం రాగానే, అందరూ కంగ్రాట్స్, డార్లింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసావు అనేవాళ్ళు నా స్నేహితులు. ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు అనే విషయం నాకు సెట్స్ లోకి వచ్చేంత వరకు తెలీదు, ప్రభాస్ ని ఎందుకు ఆలా పిలుస్తారు అనేది. అప్పుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ ‘నాకు కూడా ప్రభాస్ రెబెల్ స్టార్ అనే విషయం ఇక్కడికి వచ్చే వరకు అర్థం అయ్యేది కాదు,ఎందుకు రెబెల్ స్టార్ అని పిలుస్తారు?, మనిషి చూస్తే ఇంత సాఫ్ట్ గా విశాల హృదయం తో ఉంటాడు. అలాంటి వ్యక్తిని డార్లింగ్ అని పిలిస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇక ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే, ఆయన తదుపరి చిత్రం ‘కల్కి’ మే 9 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన మారుతీ తో ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది ఈ సినిమా వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ, వచ్చే సంక్రాంతికి కచ్చితంగా వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.