Shruti Haasan Boyfriend Pics Viral : ఈ నడుమ స్టార్ హీరోయిన్లు పెండ్లికి ముందే డేటింగ్ కల్చర్ ను మొదలు పెట్టేస్తున్నారు. పైగా వారితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. డేటింగ్ పేరతో పెండ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు. ఇలాంటి కల్చర్ బాలీవుడ్ లోనే ఎక్కువగా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత మన సౌత్ హీరోయిన్లు కూడా ఇలాగే తయారవుతున్నారు.
ఇందులో శృతిహాసన్ కూడా ఉంటుంది. ఎలాంటి అనుమానం లేదు. శృతిహాసన్ కు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఉంది. మొదట్లో ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకున్న అమ్మడు.. తర్వాత తన సొంత ట్యాలెంట్ తో ఎదిగి చూపించింది. కానీ ఇప్పుడు ఆమెను యంగ్ హీరోలు పట్టించుకోవట్లేదు. దాంతో చేసేది లేక ఏజ్ బార్ అయిన హీరోల పక్కన నటిస్తోంది.
ఇదిలా ఉండగా ఆమె వ్యక్తిగతంగా చాలామందితో డేటింగ్ చేసింది. ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికతో డీప్ డేటింగ్ లో ఉంది ఈ నాటు బ్యూటీ. హజారికతో కలిసి ముంబైలో ఒకే ఇంట్లో శృతిహాసన్ డేటింగ్ చేస్తోందంట. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఆమె తన ప్రియుడితో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. శృతిమాసన్ ఆకుప్చ చీరకట్టుకోగా.. శాంతాను హజారిక పంచెకట్టులో మెరిశాడు.
వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో శృతి కాస్త రెచ్చిపోయి తన ప్రియుడికి ముద్దులు కూడా ఇచ్చేసింది. ఇన్ని రోజులు కాస్త అనుమానాలు ఉన్నా… ఇప్పుడు మాత్రం అతన్నే పెండ్లి చేసుకుంటుందని ఈ ఫొటోలతో క్లారిటీ ఇచ్చేసింది. దాంతో ఈ జంటకు అప్పుడే విషెస్ కూడా చెబుతున్నారు.