phone tapping case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా, పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఓ మీడియా ఛానెల్ ఎండీగా ఉన్న శ్రావణ్ కుమార్ ను పోలీసులు నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే శ్రావణ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ నాంపల్లి కోర్టు జారీ చేసింది. తాజాగా శ్రావణ్ కుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.