Rajya Sabha : ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు ఆధారాలు చూపండి: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్

Rajya Sabha
Rajya Sabha : ఏపీలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. రాజ్యసభలో గురువారం బడ్జెట్ పై జరిగిన చర్యలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ హింసకు కేంద్రంగా మారిందని, అందులో ఎన్డీఏ భాగస్వామిగా ఉందన్నారు.అక్కడ హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అవినీతి చేసేందుకే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని పేర్కొన్నారు.
దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడాలని, పోలవరంలో అవినీతి జరిగి ఉంటే ఆధారాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయొద్దని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ హెచ్చరించారు.