Electricity Bill : 200 యూనిట్లు దాటితే కరెంట్ కు బిల్లు కట్టాలా వద్దా? విద్యుత్ శాఖ క్లారిటీ!
Electricity Bill : కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫోస్టేలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇటీవల మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ కలిపించింది. రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఎక్స్‌ప్రెస్, ఆర్టీనరీ, పల్లె వెలుగు, సిటీ లాంటి బస్సుల్లో ఫ్రీ జర్నీ కల్పించారు. ఆ తర్వాత మరో పథకం ‘గృహలక్ష్మి’ కింద విద్యుత్ బిల్ మాఫీ అమలు చేశారు.
200 యూనిట్ల లోపు వరకు ఫ్రీగా విద్యుత్ సప్లయ్ చేయనున్నారు. రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుంటే 200 యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ జీరో బిల్లులో యూనిట్లు, బిల్లు ప్రింట్ చేసి.. గృహజ్యోతి సబ్సీడి కింద బిల్లును మాఫీ చేసి జీరోగా ఇస్తారు.
దీని మార్గదర్శకాలపై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను ఇటీవల ఒక విద్యుత్ అధికారి నివృత్తి చేశారు.
* ప్రాపర్టీ ఎవరిదో వారే ఈ పథకానికి అర్హులు.
* 200 యూనిట్లు కరెంట్ వాడుతారో వారు అర్హులు.
* ఒకవేళ 201 (ఒక్క యూనిట్ ఎక్కువ) వాడినా ఆ మొత్తానికి బిల్లు కట్టాలి.
* గత బిల్లు బకాయి ఉంటే ఈ నెల వర్తించదు. బకాయి తిరిగి కడితే వచ్చే నెల నుంచి అమలు చేస్తారు.
గత రికార్డుల ప్రకారం 90 శాతం మంది 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారే ఉన్నారు. ఈ బిల్లు మాఫీ ఆశతో తక్కువ కరెంట్ కాల్చేవారు మరో 2 నుంచి 3 శాతం పెరుగుతారని తెలుస్తోంది. ఈ పథకంతో చాలా మంది పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బుగ్గ పెట్టుకున్నా పెరిగిన విద్యుత్ చార్జిలతో ఇబ్బంది పడేవాళ్లమని, రేవంత్ నిర్ణయంతో ఇది తమకు మేలు చేస్తుందని చెప్తున్నారు.