Google Pay Users : గూగుల్ పే వాడేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా?
Google Pay Users : నగదు బదిలీ కోసం గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నాం. యూపీఐ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సైబర్ నేరగాళ్లు మన నెంబర్ పట్టేస్తే మన ఖాతా నుంచి డబ్బు మాయం కావడం జరుగుతుంది. దీంతో మనకు బాధ కలగడం మామూలే. గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేసే క్రమంలో ఫోన్ లో స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు మన వివరాలు సేకరించి ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ పే నుంచి ఫోన్ చేస్తున్నాం. థర్డ్ పార్టీ యాప్ లు ఇన్ స్టాల్ చేసుకోమని చెబితే చేసుకోవద్దు. దీని వల్ల మనకు అనేక ఇబ్బందులు వస్తాయి. ఒక వేళ అలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ పే వారికి ఫిర్యాదు చేయాలి. గూగుల్ పేరుతో మోసపూరిత ప్రకటనలు వస్తే మనం స్పందించొద్దు. మన డబ్బుకు మనమే రక్షణగా నిలవాలి. కానీ అపరిచితులకు మన వివరాలు ఇవ్వొద్దు.
ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ వంటి వాటిని ఎక్కువగా వాడుతుంటాం. దీంతో సైబర్ నేరగాళ్లు స్ర్కీన్ షేరింగ్ యాప్ ల ద్వారా యూజిర్లు ఫోన్ నుంచి డిజిటల్ లావాదేవీలు చేయడం, ఏటీఎం డెబిట్ కార్డు వివరాలు దొంగిలించే అవకాశం ఏర్పడుతుంది.
దొంగ ఓటీపీలతో మన ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తారు. ఇటీవల కాలంలో ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నందున గూగుల్ పే యూజర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఏమరుపాటుగా ఉంటే మన ఖాతాల నుంచి డబ్బులు క్షణాల్లో మాయం కావడం సహజంగానే జరుగుతుంది.