CM Chandrababu : అమెరికాలోని టెక్సాస్ లో దుండగుల కాల్పుల్లో బాపట్ల యువకుడు దాసి గోపికృష్ణ మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతా తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని సీఎం ట్వీట్ చేశారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో చపిపోయిన వ్యక్తి ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపికృష్ణగా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపికృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రం డాలస్ లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపికృష్ణ కౌంటర్ లో ఉండగా ఓ దుండగుడు వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో గోపికృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.