Pune Porsche Accident : దేశ వ్యాప్తంగా విస్తృతంగా వార్తల్లో నిలుస్తున్న ఘటన పూణె ప్రమాధ ఘటన. ఈ కేసును పోలీసులు, జువైనల్ బోర్డు రెండు సీరియస్ గా తీసుకున్నాయి. పూణె లోని అతిపెద్ద రియల్టర్ కొడుకు మైనర్ చేసిన తప్పిదంతో ఇద్దరు టెక్కీలు మరణించారు. ఈ ఘటనలో అతన్ని మేజర్ గా ట్రీట్ చేసి కేసు విచారించాలని పోలీసులు కోర్టును అభ్యర్థిస్తుండగా.. జువైనల్ బోర్డు తమ పని తాము చేసుకుంటుంది.
ఈ కేసు రోజులో మలుపు తిప్పుతూ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నిందితుడిని తప్పించేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రైవర్ ను ప్రమాదానికి కారణం తానేనని ఒప్పుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. డాక్టర్లను సైతం బ్లడ్ షాంపిళ్లు మార్చేలా ప్రలోభ పెట్టారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు మరింత ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో మైనర్ ను పోలీసులు విచారించారు. ప్రమాదం జరిగిన రాత్రి ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
మైనర్ ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలోనే ఉన్నాడు. తాను మద్యం మత్తులో ఉండడంలో ఆ రోజు ఏం జరిగిందో గుర్తు రావడంలేదని చెప్పినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు నిందితుడు తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఫస్ట్ వెళ్లిన బార్ లో కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు ఆధారాలు తీసుకున్నారు. అక్కడి నుంచి సెకండ్ బార్ కు వెళ్లి మరింత మద్యం తాగినట్లు విచారణలో వెల్లడైంది. ఇంత పెద్ద మొత్తంలో తాగి తన పోర్షే కారులో అతి వేగంగా ఇంటికి వెళ్తుండగా ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దానిపై ఉన్న ఇద్దరు టెక్కీలు స్పాట్ లోనే మరణించారు.
బ్లడ్ షాంపిళ్లను తన తల్లి బ్లడ్ తో కవర్ చేయాలని చూశారు. దీంతో సదరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లితో పాటు కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నించిన తాత, తండ్రిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రమాదానికి సంబంధించి 3 కేసులు నమోదవగా.. 100 మందితో కూడిన బృందాలు దర్యాప్తులో భాగం అయ్యాయి.