NTRs Car Collection : ఎన్టీఆర్ కార్ కలెక్షన్ చూస్తే షాక్..ఒక్కొక్క దాని రేటు ఎంతంటే..
NTRs Car Collection : జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కొద్దిగా నిరాశ చెందాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో స్టూడెంట్ నం.1 సినిమాతో తన సత్తాను చాటుకున్నారు.. ఆ రోజు మొదలైన విజయాల పరంపర నేటీకి కొనసాగుతోంది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగి వసూళ్లలో బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతున్నాడు. మధ్యలో కొన్ని ఆటుపోట్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా తెలుగుజాతి గర్వించే పాన్ ఇండియా స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు .
ఇది ఇలా ఉంటే మన ఎన్టీఆర్ కు డ్రైవింగ్ అంటే ప్రాణం. తన లగ్జరీ కార్లంటే మక్కువ ఎక్కువ. ఆయన దగ్గర ఖరీదైన కార్లు బోలెడు ఉన్నాయి. ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో ఈ కారు విలువ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాలు చేస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు బద్దలు కొడతారు ఎన్టీఆర్ అలానే ఏవైనా కార్లు కొనాలి అన్న అంతే స్థాయిలో భారీ ఖర్చు చేస్తారు. ఎన్టీఆర్ కు సినిమాలంటే ఎంత ఇష్టమో కార్లు కూడా అంతే ఇష్టం.
ఇటీవల రెండు భారీ ధర పలికే కార్లను కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే లంబోర్ఘిని ఉరస్ అలాగే రేంజ్ రోవర్ లను కలిగి ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ ఎస్ క్లాస్ అలాగే హుందాయి ఎలక్ట్రిక్ 5 బ్లాక్ ను కొనుగోలు చేశాడు. తనకు ఇష్టమైన నలుపు రంగులో కష్టపడి సంపాదించిన మెర్సిడెస్ బెంజ్ బ్యాక్ ఎస్ క్లాస్ కారును ఇటీవలే కొన్నాడు. దీని విలువ రూ. 4.23 కోట్లు. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఐకానిక్ 5 బ్లాక్ ధర రూ.55.2 లక్షలు. ప్రస్తుతం ఈ రెండు కార్ల విలువే దాదాపు ఐదు కోట్లు. అంతేకాదు ఎన్టీఆర్ 2021లో దేశంలోని తన ఇంటికి లాంబోర్గినీ ఉరస్ గ్రాఫైట్‌ని తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.