Divvela Madhuri : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దువ్వాడ కుటుంబ వివాదం… ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో రోజుకో టర్న్ తీసుకుంటుంది. పరిష్కారానికి దారేదనే కన్ఫ్యూజనే తప్పా ఎలాంటి క్లారిటీ రావడంలేదు. అయితే లేటెస్ట్గా ఈ దువ్వాడ ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ చేటుచేసుకుంది. వాణి, తన పిల్లలు ఇంట్లోకి వెళ్లొచ్చని కోర్టు అనుమతి ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారికి షాక్ తగిలింది. ఇంటి బాల్కనీలో మాధురి కనిపించడం అవాక్కయ్యేలా చేసింది. మాధురిని ఇంట్లో చూసిన వాణి, ఆమె తరుపు బంధువులు.. ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమను ఇంట్లోకి పంపించాల్సిందేనంటూ అక్కడున్న పోలీసులతో గొడవకు దిగారు. కోపంతో ఇంటి పవర్‌ను కట్ చేసి.. ఇంటి ముందు కూర్చుని ఆందోళన కంటిన్యూ చేశారు వాణి.
నా ఇంట్లో నేనున్నాను… వాళ్లెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్లు తనదేనని.. దువ్వాడ శ్రీను ఇంటిని తన పేరు మీద రాశారని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఇంటి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ మాధురి చూపించారు. దీంతో ఈ మధ్య కొన్ని రోజులుగా ఈ వివాదం కాస్త సద్గుమణిగినట్లు కనిపిస్తోంది. తాజాగా దివ్వెల మాధురికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సదరు యాంకర్ మీ ఫ్యాన్స్ బిగ్ బాస్ కు మీరు వెళ్లాలని కోరుకుంటున్నారు. వెళ్లాలని ఉందా అని ప్రశ్నిస్తారు. దీనికి మాధురి సమాధానమిస్తూ.. నాకు బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఇష్టం ఉందని చెబుతుంది. వాళ్ల మధ్య గొడవకు వాణినే కారణమని భవిష్యతులో ఇదే బంధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. యాంకర్ శ్రీనును హీరో అనుకుని.. మీరు హీరోయిన్ అనుకుని ఓ డైలాగ్ చెప్తారా అంటే మాధురి సిగ్గుల మొగ్గలు వేసింది. తాను రాజా అని ముద్దుగా దువ్వాడ శ్రీనును పిలుస్తానని తెలిపారు. మరి చూద్దాం దివ్వెల మాధురి ఇంట్రెస్ట్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఆలకించి ఆమెను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపిస్తారేమో.