BJP Ads : షాకింగ్: పెద్ద మొత్తంలో పట్టణ జనాభాను ప్రభావితం చేసిన బీజేపీ యాడ్స్..
BJP Ads : ‘ఆప్ కీ బార్ 400 పార్’ ఇది 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్లోగన్. మరోసారి మోడీ హయాంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని భావించిన పార్టీ తాము పదేళ్లలో చేసిన అభివృద్దిని ప్రకటనల రూపంలో ప్రజల ముందు ఉంచింది. వీటిని చూసిన 61 శాతం జనాభా బీజేపీకి ఓటేశాయి. ఇక ఇతర పార్టీలోని నేతలు కూడా బీజేపీకి ఎందుకు ఓటు వేయద్దని ప్రశ్నించుకునేలా చేశాయి.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయ ప్రకటనలు (యాడ్స్) 61 శాతం పట్టణ జనాభాను ఆకట్టుకున్నాయి. తమకు ఓటు వేసేందుకు గణనీయంగా ప్రభావితం చేశాయని ఇటీలీకి చెందిన ‘యూగవ్’ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్ లో కొనసాగుతున్న 18వ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలను 76 శాతం మంది పట్టణ వాసులు చూశారని, 14 శాతం మంది చూడలేదని నివేదిక వెల్లడించింది.
రాజకీయ ప్రకటనలు చూసిన వారిలో 81 శాతం మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటనలను గమనించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) నుంచి 47 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి 12 శాతం మంది మాత్రమే ప్రకటనలు చూశారు. మిలీనియల్స్ (80వ దశకంలో జన్మించినవారు) కాంగ్రెస్ ప్రకటనలను చూశారు. 53 శాతం మంది బయట జరుగుతున్న పరిస్థితులను గమనించారు.
రాజకీయ ప్రకటనలకు యూ ట్యూబ్ 67% వ్యూవర్ షిప్ తో అగ్రస్థానంలో ఉండగా, టీవీలు 58% వ్యూవర్ షిప్ తో రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా మిలీనియల్స్, బేబీ బూమర్స్ (60+ ఏజ్ గ్రూప్)లో టీవీ వ్యూవర్ షిప్ ఎక్కువగా ఉంది. ఇన్ స్టా 43% వ్యూవర్ షిప్ తో మరొక ప్రజాదరణ పొందిన ప్లాట్ ఫాం, తర్వాత వాట్సాప్ (38%), మెటా (35%) ఉన్నాయి.
బీజేపీ ప్రకటనలు అత్యంత విస్తృతంగా చూడడమే కాకుండా 58% పట్టణ భారతీయులు అత్యంత సృజనాత్మకమైనవిగా భావించారు. ఇందుకు కాంగ్రెస్ కు 28%, ఆప్ కు 6% తో పోల్చారు. వీక్షకులను ఆకట్టుకునే ప్రకటనల విషయానికి వస్తే బీజేపీ 60 శాతం, కాంగ్రెస్ 27 శాతం, ఆప్ 5 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
అంతేకాక, 61% పట్టణ భారతీయుల నిర్ణయాన్ని బీజేపీ ప్రకటనలు ప్రభావితం చేశాయని లేదంటే మరో పార్టీకి ఓటు వేయడంపై ఓటర్ల మనసు మార్చుకునేలా చేశాయని నివేదించారు. కాంగ్రెస్ కు 27 శాతం మంది, ఆప్ కు 10 శాతం మంది ఇదే చెప్పారు. మిలీనియల్స్ లో కాంగ్రెస్ ప్రకటనల పట్ల స్పందన ఎక్కువగా ఉంది, 37% మంది ఆ పార్టీ ప్రకటనల ప్రచారాల ద్వారా ప్రభావితమయ్యారని, తమకు ఓటు వేయాలని సూచించారు.