CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అన్ని సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రానున్నాయని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో జగన్ లో భయం పట్టుకుంది. దీనికి తోడు పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మూడు కూటములు పోటీలో ఉండడంతో గెలుపు ఎవరిదో అనే అంచనాలు వేయడానికి కుదరడం లేదు.
జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో షాక్ తగిలింది. ఆ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎలీసా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె క్రైస్తవ మిషనరీస్ నిర్వహిస్తూ ఉంటారు. ఆమెకు గుంటూరు ఎంపీ స్థానం కేటాయించాలని కొద్ది రోజులుగా కోరుతున్నా జగన్ వినిపించుకోలేదు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వైసీపీలో ప్రకంపనలు కలిగేలా చేశారు.
కర్నూలు, అనంతపురం లాంటి జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లకు టికెట్లు ఇచ్చినా ఇక్కడ మాత్రం మొండి చేయి చూపించడంతో ఆమె జీర్ణించుకోలేక పార్టీకి టాటా చెప్పేశారు. ఇలా జగన్ కు వరుసగా షాక్ లు ఇస్తుండడంతో క్యాడర్ లో అయోమయం నెలకొంటున్నది. ఈనేపథ్యంలో జగన్ కు ఏపీలో నేతల నుంచి కష్టాలే రానున్నాయి. ఒక్కొక్కరు పార్టీని వీడుతుంటే పార్టీ భవితవ్యం గందరగోళంగా మారే అవకాశాలున్నాయి.
పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి ఎంతో కొంత మేలు కలిగేలా చూడాలి. కానీ జగన్ ఆ పని చేయడం లేదు. ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అంటున్నారు. దీంతోనే కొందరు నేతలు పార్టీని వీడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. తమకు ప్రయోజనం కలగని చోట ఎందుకు ఉండడమని వైసీపీపైకి గుడ్ బై చెబుతున్నారు.
ఇంకా వైసీపీలో చాలా మంది పార్టీని వీడుతారని తెలుస్తోంది. అధినేత నిర్వాకంతోనే పార్టీని వదిలేస్తున్నారు. పార్టీపై వ్యతిరేక పవనాలు వీయడంతో వచ్చే ఎన్నికల్లో విజయం కష్టమే అంటున్నారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దుకునేందుకు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.