Lakshmi Parvathi : శక పురుషుడు నందమూరి తారక రామారావు గురించి పరిచయం అవసరం లేదు. ఆదర్శ వ్యక్తిగా ఆయన జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. ఆయన నడక పూల బాటలో సాగలేదు. ఆయన మరణం వరకు ఆయన ముళ్ల బాటనే ఎంచుకున్నారు. అందుకే ఆయన కీర్తి నేడు విదేశాల వరకు వెళ్లింది. అమెరికాలో ఆయనను స్మరించుకుంటున్న అక్కడి ప్రజా ప్రతినిధులు ఆయనకు నివాళులు కూడా అర్పిస్తున్నారు. చదువు ముగిసినప్పటి నుంచి సినిమా రంగం, ఆ తర్వాత రాజకీయ రంగంలో ఆయన సాధించిన విజయాలు చెప్పుకుంటూ పోతే పదాలు చాలవేమో అన్నట్లుగా ఉంటాయి. తనను చిన్న పిల్లవాడిలా కొడుకులా భావించిన ఆయన భార్య బసవతారకం మరణం ఆయన జీవితంలో తీవ్ర విషాదానికి కారణమైంది.
ఆ తర్వాత చాలా కాలం ఆయన ఒంటరి జీవితం గడిపాడు. రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చింది. అప్పటి నుంచి లోకం దృష్టిలో మరిన్ని అవమానాలు పడినా తన తుది జీవితాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆయన లక్ష్మీ పార్వతితో చివరి రోజులు గడిపాడు. ఆమె కూడా ఆయనకు సేవలు చేస్తూ గడిపింది. ఆయన చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పగ్గాలు పట్టుకోవాలని చూసింది కానీ చంద్రబాబు నాయుడు అది జరగనివ్వలేదు.
శక పురుషుడు ఎన్టీఆర్ లేకుంటే లక్ష్మీ పార్వతి సాధారణ మహిళ మాత్రమే. ఎన్టీఆర్ పంచన చేరిన ఆమె చాలా విషయాలలో కుటుంబానికి అతన్నిదూరం చేసిందన్న ఆరోపణనలు కూడా మోసింది. ఇక ఆమె ఎప్పుడూ ఒక డైలాగ్ అంటుంది. ‘ఇప్పటికీ ఆయన నా కలలోకి వచ్చి లక్ష్మి ఎలా ఉన్నావు’ అని అడుగుతుంటారు అంటుంది. దీన్ని కొందరు వైరల్ రాయుళ్లు ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. ‘ఆయన అన్ని సార్లు వఛ్చి పలకరిస్తుంటే…నువ్వొక్కసారైనా వెళ్లి పలకరించొచ్చుగా…! అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా వైరల్ రాయుళ్లకు ఏదీ అడ్డు కాదని దీని ద్వారా తెలుస్తోంది.